దివ్య ప్రేమ్ సేవా మిషన్ అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అక్టోబర్ 26న దివ్య ప్రేమ్ సేవా మిషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లిలోని జేఎన్టీయూ టెక్నాలజీ యూనివర్శిటీలో చక్రవ్యూహ్ అనే అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీకృష్ణుడి పాత్రలో నితీశ్ భరత్ రెండు గంటల పాటు ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.