సర్పంచ్ లకు పవరొచ్చింది

సర్పంచ్ లకు పవరొచ్చింది

సర్పంచ్, ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్లను నోటిఫై చేస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 17 నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సంయుక్తంగా చెక్ పవర్ అమల్లోకి వస్తుందని తెలిపింది.  కొత్త పంచాయతీ చట్టం మార్చి 29న అసెంబ్లీ ఆమోదం పొందగా… అదే ఏడాది ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఏడాది తర్వాత సర్పంచ్, ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సర్కార్.

కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చినప్పటికి సర్పంచులకు ఎలాంటి నిధులు లేకపోవటంతో…రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కొనసాగాయి. పదవిలోకి వచ్చినా… పంచాయతీ పనులు చేయలేక ఖాళీగా కూర్చున్నారు సర్పంచ్ లు. కొంత మంది సర్పంచ్ లు అయితే… నిధుల కోసం భిక్షాటన కూడా చేశారు. కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నాయని సర్కార్ తీరుపై మండిపడ్డారు. దీంతో అన్ని విధాలుగా సర్కార్ పై ఒత్తిడి పెరగటంతో.. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచులకు సంయుక్తంగా చెక్ పవర్ కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.