వందలు, వేల అంకెలు కూడా తెలియని ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ : చెక్ పై రాతలు చూసి దేశం అవాక్కయ్యింది..!

వందలు, వేల అంకెలు కూడా తెలియని ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ : చెక్ పై రాతలు చూసి దేశం అవాక్కయ్యింది..!

స్కూల్ టీచర్.. అంటే విజ్ఞాన సముద్రం అంటుంటారు. పిల్లలకు చదువు చెప్పడంతో పాటు సమాజంలో తన చుట్టూఉన్న వారికి తెలియని విషయాలు చెప్పి ప్రభావితం చేసే వారిగా చూస్తుంటారు. మరి అలాంటిది.. ప్రిన్సిపల్ అంటే..? టీచర్ వృత్తిలో ఎంతో అనుభవం.. సీనియారిటీ తర్వాతనే ఆ పదవి దక్కుతుంది. అంటే నాలెడ్జ్ లో ఆరితేరి ఉంటారు. కానీ ఈ ప్రిన్సిపల్ మాత్రం.. రెగ్యులర్ గా వినియోగించే పదాల స్పెల్లింగ్ కూడా రాయలేకపోవడంతో.. తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

విషయంలోకి వస్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ సంతకం చేసిన చెక్కు స్పెల్లింగ్ మిస్టేక్స్ కారణంగా బౌన్స్ అయ్యింది. ఇది కాస్త సోషల్ మీడియాకు చేరడంతో ఫుల్ ట్రెండింగ్ అవ్వడంతో పాటు నెటిజన్ల విమర్శలకు దారితీసింది. 

సెప్టెంబర్ 25న అట్టర్ సింగ్ అనే మధ్యాహ్న భోజన కార్మికుడి పేరుతో  రూ.7,616 కు చెక్కు ఇష్యూ చేశారు ప్రిన్సిపల్. అయితే ఈ చెక్కులో ఇంగ్లీష్ లెటర్స్ లో మిస్టేక్స్ ఉండటంతో 
బ్యాంకు రిజెక్ట్ చేసింది. ఇంగ్లీష్ లెటర్స్ అంటే అవేదో పెద్ద పెద్ద పదాలకు సంబంధించినవి కావు. LKG స్టూడెంట్ కూడా కరెక్ట్ రాసే పదాలను రాయలేకపోయాడు ఆ ప్రిన్సిపల్. 

LKG స్టూడెంట్ కంటే ఘోరం:

ఒక ప్రిన్సిపల్ అయ్యుండీ ఇంత ఘోరంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయడమేంటని నెటిజన్లు ఫైరవుతున్నారు. దీనికి కారణం.. సెవెన్ కు బదులు సేవెన్ (seven - saven), థౌజెండ్ కు బదులు థర్స్ డే (thousand - thursday), సిక్స్టీన్ కు బదులు సిక్స్టీ (sixteen - sixty).. ఇది ఆ మాస్టారు రాసింది. 

ఇంత ఘోరమైన మిస్టేక్స్ ఉన్నందుకు బ్యాంకు ఆ చెక్కును రిజెక్ట్ చేసింది. దీంతో చెక్ బౌన్స్ అయ్యింది. ఈ బౌన్స్ అయిన చెక్కు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కనీసం బేసిక్ స్పెల్లింగ్స్ కూడా రాయలేని మాస్టారు.. పిల్లలకు పాఠాలేం చెబుతారు.. వాళ్ల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతారని నెటిజన్లు ఫైరవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో ఈ ఒక్క ఉదాహరణ చాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తు్న్నారు. 

అయితే ఈ చెక్కును ప్రిన్సిపల్ ఫిల్ చేశారా.. లేక క్లర్క్ మరెవరైనా ఫిల్ చేస్తే చూడకుండా గుడ్డిగా సైన్ చేశారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఆయన చూడకుండా సంతకం పెట్టి ఉంటే.. ఇంత కేర్ లెస్ గా ఉన్న ప్రిన్సిపల్ పిల్లల విషయంలో ఎంత వరకు నాణ్యమైన విద్యను అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. 

మిమాచల్ ప్రదేశ్ లో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సరిగ్గా జరగటం లేదని.. ఈ ఘటన స్పెల్లింగ్ మిస్టేక్స్ గా చూడవద్దని.. ఇది ప్రభుత్వ టీచర్ల బాధ్యత, ఎడ్యుకేషన్న సిస్టంలో ఉన్న నిర్లక్ష్యంగా పరిగణించి సరైన చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. 

చెక్ బౌన్స్ మ్యాటర్ మొత్తానికి ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ కు చేరింది. ఇప్పటికే టీచర్ల కొరత, మౌలి సదుపాయాలు లేకపోవడం, పిల్లలు పాస్ ఔట్ పడిపోతుండటం,.. మొదలైన విమర్శలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి, విద్యా శాఖకు ఈ ఇష్యూ తలనొప్పిగా మారింది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు.