చర్లగూడెం రిజర్వాయర్కు ధర్మభిక్షం పేరు : మంత్రి పొన్నం ప్రభాకర్

చర్లగూడెం రిజర్వాయర్కు ధర్మభిక్షం పేరు : మంత్రి పొన్నం ప్రభాకర్

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల తాటి, ఈత మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని, వాటి పెంపకానికి కల్లు గీత సంఘాలు ముందుకు రావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్​ పిలుపునిచ్చారు. గీత పని వారల సంఘం వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం అంటే తనకెంతో గౌరవమని, ప్రభుత్వంతో చర్చించి మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్ కు ధర్మభిక్షం పేరు పెట్టేలా కృషి చేస్తానని మాటిచ్చారు. 

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు.

 ఈ కార్యక్రమంలో గీతపనివారల సంఘం ప్రధాన కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్, సమన్వయ కార్యదర్శి బొమ్మగాని నాగభూషణం, ఉపాధ్యక్షులు కేవీఎల్, దూసరి శ్రీరాములు, పండ్ల రాములు, పబ్బూరి దేవేందర్ గౌడ్, బొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.