చర్లపల్లి- తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌

చర్లపల్లి- తిరువనంతపురం  అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌
  • జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
  •     ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయల్దేరనున్న ట్రైన్​
  •     తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కీలక 
  • స్టేషన్లలో స్టాప్స్    దేశవ్యాప్తంగా అందుబాటులోకి 4 అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్​లు

తెలంగాణకు రెండో అమృత్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ ట్రెయిన్‌‌‌‌‌‌‌‌కు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించనున్న 4 అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ సర్వీసుల్లో భాగంగా.. చర్లపల్లి– తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ను తిరువనంతపురంలో ప్రారంభించారు. ఈ రైలు  ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని చర్లపల్లి నుంచి బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు కేరళలోని తిరువనంతపురం చేరుకుంటుంది. ప్రతి బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తిరువనంతపురంలో బయలుదేరి, గురువారం రాత్రి 11:30 గంటలకు చర్లపల్లికి రీచ్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైళ్లను కూడా మోదీ ప్రారంభించారు. ఇవి నాగర్‌‌‌‌‌‌‌‌కోయిల్ – మంగళూరు, తిరువనంతపురం – తాంబరం, త్రిసూర్ – గురువాయూర్ మధ్య పయనిస్తాయి. కాగా, తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ను కేటాయించినందుకుగానూ ప్రధాని మోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు.