సంక్షేమ పథకాల్లో మాలలకు అన్యాయం: రామచందర్

సంక్షేమ పథకాల్లో మాలలకు అన్యాయం: రామచందర్

ముషీరాబాద్,వెలుగు : దళిత బంధు, డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి లాంటి సంక్షేమ పథకాల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని సంఘం కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందడంలో మాలలు వెనకబడి ఉన్నారని, దళిత బంధును జనాభా దామాషా ప్రకారం కేటాయించాలని డిమాండ్ చేశారు.

 రాష్ట్ర ప్రభుత్వం మాలల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాలల సమస్యలపై ఈనెల 6న ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నట్లు  తెలిపారు. సమావేశంలో వర్కింగ్ చైర్మన్ తాళ్లపల్లి రవి, వినోద్ కుమార్, నల్లాల కనకరాజు, మందల భాస్కర్, రావుల అంజయ్య, ఆర్.వి గిరి, గడ్డం సత్యనారాయణ, అనిల్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.