హైదరాబాద్, వెలుగు: దేశ రాజధానిలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయుల నుంచి భారీగా తగ్గాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.2,500 తగ్గి రూ.1,57,200 వద్ద ముగిసింది.
కిలో వెండి ధర రూ.14 , 300 పతనమై రూ.3.20 లక్షల వద్ద నిలిచింది. బుధవారం ధర రకిఆర్డుస్థాయి రూ.3.34 లక్షలకు చేరింది. ఐరోపా దేశాలపై టారిఫ్ విధింపు నిర్ణయాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపసంహరించుకోవడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
