- మాజీమంత్రి హరీశ్‌రావు
మెదక్, వెలుగు : ‘ఓ వైపు నేను, మరో వైపు కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తుండడంతో, మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక.. ప్రజల దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు ఇస్తున్నారు’ అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ఎన్నికల టైంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేవరకు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని వెంటాడుతూనే ఉంటామని చెప్పారు. మెదక్‌లో గురువారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందన్నారు.
ట్రాఫిక్ చలాన్లను డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ల నుంచి కట్ చేస్తామనడం దారుణం అన్నారు. మెదక్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే.. మన జిల్లాను మనం రద్దు చేసుకున్నట్లే అని అన్నారు. అంతకుముందు మెదక్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొండన్ సావిత్రి, మాజీ కౌన్సిలర్ సురేందర్‌గౌడ్, గోదల జ్యోతి, నాయకులు సంతోష్ బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్ పాల్గొన్నారు.
