సిద్దిపేట(దుబ్బాక), వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలో వివిధ అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస రెడ్డి గురువారం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో మంత్రిని కలసి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
