చెస్ పోటీలతో మేథోశక్తి పెరుగుతుంది : ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ హరిణి

చెస్ పోటీలతో మేథోశక్తి పెరుగుతుంది : ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ హరిణి

పర్వతగిరి, వెలుగు : చెస్​ఆటద్వారా స్టూడెంట్లలో మేథోశక్తి, ఏకాగ్రత, వ్యూహరచన పెంపొందుతాయని చెస్ నెట్ వర్క్, ప్రతిమ ఫౌండేషన్​ ఫౌండర్​ హరిణి అన్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరి హైస్కూల్​లో బుధవారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతగిరి ప్రాథమిక, హైస్కూల్స్, మోడల్ స్కూల్​, కస్తూర్భా గాంధీ, మైనార్టీ, సోషల్​ వెల్ఫేర్ స్కూళ్లకు చెస్ బోర్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెస్‌ను మనసుపెట్టి నేర్చుకుంటే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుందని సూచించారు. కార్యక్రమంలో హెచ్​ఎం నవీన్ కుమార్, చెస్ నెట్వర్క్ ఫౌండర్ కోదాడ సుధీర్, ఎంఈవో భిక్షపతి, రిటైర్డ్ ఎంఈవోలు లింగారెడ్డి, అశోక్, రిటైర్డ్ డిగ్రీ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, పాక రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.