చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 130 తగ్గిన ధర

చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 130 తగ్గిన ధర

సండే వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్దదిగదు. కానీ రెండు వారాల నుంచి చికెన్ ధర కేజీ రూ. 300కి చేరింది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు కేజీ రూ.300 వరకు ఉన్న ధర.. ఇప్పుడు రూ. 150కి చేరింది. దాంతో నాన్ వెజ్ ప్రియులు ఖుషీఖుషీ అవుతున్నారు. కరోనా వస్తుందేమోనని కొంతమంది చికెన్ కొనడానికి భయపడుతుంటే... కొంతమంది మాత్రం చికెన్ తిని ఇమ్యూనిటి పెంచుకోవాలని భావిస్తున్నారు. రంజాన్ సమయంలో హలీమ్ చాలా ఫేమస్. అయితే కరోనాకు బయపడి ఎవరూ అటువైపు చూడటం లేదు. కానీ చికెన్ ధర తగ్గడంతో.. ఇప్పడు ఇంట్లోనే హలీమ్ చేసుకుంటామని చికెన్ ప్రియులు అంటున్నారు. అటు చికెన్ షాపు యాజమానులు కూడా రేట్లు తగ్గడంతో సేల్స్ పెరిగాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే వెళ్లి చికెన్ తెచ్చుకొని మీకు నచ్చిన విధంగా వండుకొని తినండి.