వృక్ష‌మాత‌ తిమ్మ‌క్కను స‌న్మానించిన సీఎం కేసీఆర్

వృక్ష‌మాత‌ తిమ్మ‌క్కను స‌న్మానించిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : వృక్ష‌మాత‌, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌కురాలు, ప్ర‌ముఖ పర్యావ‌ర‌ణ‌వేత్త, ప‌ద్మ శ్రీ తిమ్మ‌క్క‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌(110) బుధవారం ( ఈనెల 18వ తేదీన) ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి స‌మీక్షా స‌మావేశానికి తిమ్మ‌క్క‌ను సీఎం కేసీఆర్ స్వ‌యంగా తీసుకెళ్లారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన మంత్రులు, అధికారుల‌కు తిమ్మ‌క్క‌ను కేసీఆర్ ప‌రిచ‌యం చేశారు.

మొక్క‌ల్నే పిల్ల‌లుగా భావించి..
బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మ‌క్క కూడా నిలిచారు. పెళ్లైన 25 సంవత్సరాల వరకు కూడా సంతానం కలగకపోవడంతో మొక్కలనే పిల్లలుగా భావించి, పచ్చదనం పర్యావరణ హితం కోసం తాను పని చేస్తున్నారు. తిమ్మక్క అందించిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

మరిన్ని వార్తల కోసం..

కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం