కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తుండు: మల్లురవి

కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తుండు: మల్లురవి

సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రజలను కుల, మత పరంగా విడదీసి చూస్తున్నారని విమర్శించారు. 
మీడియా సమావేశంలో మాట్లాడిన మల్లు రవి దేశంలో మతపరమైన విభజన చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు లేకుండా చేయడం కోసం 6 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను   ప్రైవేట్ సంస్థలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు భారత్ జోడో పాదయాత్ర  చేస్తున్నారని మల్లు రవి వివరించారు. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా పాలన చేస్తున్న మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏకం కావాలని మల్లు రవి పిలుపునిచ్చారు.