వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో గెలుస్తాం : సీఎం కేసీఆర్ 

వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో గెలుస్తాం : సీఎం కేసీఆర్ 

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో గెలుస్తామని పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. 

గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు వచ్చాయన్నదే ముఖ్యమన్నారు కేసీఆర్. మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదన్నారు. ‘‘జాగ్రత్తగా లేకుంటే మీకే ఇబ్బంది.. నేను చేసేదేం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.  బాగా పనిచేసిన వారికే టిక్కెట్లు ఇస్తామన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కేడర్ లో అసంతృప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్ధేశం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తరువాత జరగుతున్న మొదటి ప్రతినిధుల సభ ఇది.