వారం రోజుల్లో పరిష్కరించకపోతే సీబీఐకి అప్పగిస్తాం..పోలీసులకు సీఎం డెడ్ లైన్

వారం రోజుల్లో పరిష్కరించకపోతే సీబీఐకి అప్పగిస్తాం..పోలీసులకు  సీఎం డెడ్ లైన్

పశ్చిమ బెంగాల్ లో జూనియర్  మెడికో మర్డర్ పై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందించారు.ఇవాళ ఉదయం మృతురాలి ఇంటికెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మమత..  కేసును వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఆగస్టు 18 నాటికి పోలీసులు దర్యాప్తు పూర్తి చేయకపోతే సీబీఐకి అప్పగిస్తామని తెలిపారు. కేసులో ఎంతమంది నిందితులున్నా..వారందరినీ ఆదివారంలోగా అరెస్ట్ చేస్తామన్నారు.  ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.    ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె పోలీసులకు డెడ్ లైన్ విధించారు.

మరో వైపు మెడికో మర్డర్ పై ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. RG కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సందీప్ ఘోష్ తన పోస్టుకు రిజైన్ చేశారు. అటు దేశ వ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.  హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్ల భద్రతకు కేంద్రం ప్రోటోకాల్ రిలీజ్ చేయాలని ఫోర్డా డిమాండ్ చేసింది.  అటు బాధిత కుటంబానికి పరిహారం చెల్లించాలని ఫోర్డా స్పష్టం చేసింది.