శంకరమఠ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

శంకరమఠ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లకుంటలోని శంకర్ మఠ్ ను సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా మఠంలోని చంద్ర శేఖరుడిని, వినాయకుడిని, శారదా దేవిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం శృంగేరీ పీఠాధిపతి విధుశేఖర భారతీస్వా మిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ధర్మ విజయ యాత్ర లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన శృంగేరి పీఠాధిపతి విధు శేఖర భారతీ స్వామిని మర్యాపూర్వకంగా కలిశారు. వేముల వాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్దిపై  విధుశేఖర భారతీ స్వామికి వివరించారు. పునరుద్ధరణ, అభివృద్ధికి సం బంధించిన అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

►ALSO READ | హైదరాబాద్తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే జిల్లాలు ఇవే..