తెలంగాణ ప్రముఖ కవి,రచయిత అందె శ్రీకి అభిమానులు, ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్ కేసర్ లోని ఎన్ఎఫ్ సీ నగర్ కు వరకు అంతిమయాత్ర జరిగింది. కడచూపు చూసేందుకు అభిమానులు, కళాకారులు భారీగా తరలివచ్చారు. ఈ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో ఘట్ కేసర్ లో కాసేపట్లో అందెశ్రీకి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తాతోపాటు ఇతర అధికారులు అంత్యక్రియల ఏర్పాట్లు సమీక్షించారు. 500 మంది కళాకారులు ఆటపాటలతో అందె శ్రీ అంతిమ యాత్రలోపాల్గొన్నారు. యాత్ర సాగుతున్నంతసేపు కళాకారులు ఆడిపాడారు.
అంతిమ యాత్రలో భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సమీక్షించారు. అంతిమ యాత్రలో వేలాది మంది ఘట్ కేసర్ జనం తరలివచ్చారు. అమర్ రహే అందె శ్రీ అంటూ నినాదాలు చేశారు. కళాకారుడిగా.. తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంది.
