అసెంబ్లీ సెక్రటరీగా తిరుపతి..

అసెంబ్లీ సెక్రటరీగా తిరుపతి..
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ 
  • కౌన్సిల్ సెక్రటరీగా నరసింహచార్యులు..

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సెక్రటరీగా తిరుపతిని నియమిస్తూ సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు  ట్రిబ్యునల్ చైర్మన్ గా తిరుపతి పనిచేస్తున్నారు. కొద్ది కాలం క్రితం లా సెక్రటరీగా తిరుపతి పనిచేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సెక్రటరీగా ఉన్న నరసింహచార్యులును కౌన్సిల్ సెక్రటరీగా నియమించారు. అసెంబ్లీ, కౌన్సిల్ కు ఒకే సెక్రటరీ ఉండగా ప్రభుత్వం రెండు సభలకు వేర్వేరు సెక్రటరీలను నియమించింది. 

అదే విధంగా కౌన్సిల్ ను అసెంబ్లీలోకి మారుస్తున్నారు. అసెంబ్లీ ముందు ఉన్న బిల్డింగ్ ను రెనోవేట్ చేస్తున్నారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో స్టార్ట్ అయ్యే కౌన్సిల్ సమావేశాలు అసెంబ్లీ బిల్డింగ్ లోనే నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.