పోలారిస్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఇండియన్ మోటార్‌సైకిల్ ‘చీఫ్’ రేంజ్ బైకులను రిలీజ్ చేసింది. వీటి ధరలు రూ.20.75 లక్షల నుంచి మొదలవుతాయి. వీటిలో చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. మూడింట్లోనూ 1,890 సీసీ ఉంటుంది. ఏబీఎస్, టచ్‌స్క్రీన్ రైడ్ కమాండ్, 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, కీలెస్ ఇగ్నిషన్ వంటి సదుపాయాలు ఉంటాయి.
