సెస్ ఛైర్మన్ గా చిక్కాల రామారావు ఏకగ్రీవం

సెస్ ఛైర్మన్ గా చిక్కాల రామారావు ఏకగ్రీవం

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఛైర్మన్గా చిక్కాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి సింగిల్ నామినేషన్ దాఖలుకావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అటు వైస్ ఛైర్మన్ పదవికి దేవరకొండ తిరుపతి నామినేషన్ వేశారు. సెస్ తంగళ్ళపల్లి డైరెక్టర్గా చిక్కాల రామారావు విజయం సాధించగా... కోనరావుపేట డైరెక్టర్గా దేవరకొండ తిరపతి ఎన్నికయ్యారు. వీరిద్దరు బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగి గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన 15 మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం. 

15 డైరెక్టర్లు బీఆర్ఎస్ వారే..

ఉత్కంఠగా జరిగిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నికలో 15 మంది బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు.  సిరిసిల్ల టౌన్ -1 డైరెక్టర్గా  దిడ్డి రమాదేవి (BRS), సిరిసిల్ల టౌన్ -2 డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ (BRS) ఎన్నికయ్యారు.   తంగళ్ళపల్లి   డైరెక్టర్గా   చిక్కాల రామారావు ( BRS),  ముస్తాబాద్ డైరెక్టర్గా సందుపట్ల అంజిరెడ్డి ( BRS),  ఎల్లారెడ్డిపేట   డైరెక్టర్గా  వరుస  కృష్ణ హరి(BRS),  గంభీరావుపేట డైరెక్టర్గా  గౌరనేని నారాయణరావు  (BRS),  వీర్నపల్లి డైరెక్టర్ గా  మాడుగుల మల్లేశం (BRS),  వేములవాడ అర్బన్  డైరెక్టర్గా రేగులపాటి హరి చరణ్ రావు,  వేములవాడ టౌన్ డైరెక్టర్గా నామాల ఉమా,  కోనరావుపేట  డైరెక్టర్గా దేవరకొండ తిరపతి (BRS),   రుద్రంగి డైరెక్టర్గా ఆకుల గంగారం (BRS), ఇల్లంతకుంట డైరెక్టర్గా మల్లుగారి రవీందర్ రెడ్డి(BRS),  బోయిన్పల్లి డైరెక్టర్ గా కొట్టేపల్లి సుధాకర్ (BRS) ఎన్నికయ్యారు.