దిల్ రాజు చేతుల మీదుగా .. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్

దిల్ రాజు చేతుల మీదుగా .. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్

పలు చిత్రాల్లో స్టార్ హీరోల చిన్నప్పటి పాత్రల్లో నటించిన దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. తన్వి నేగి హీరోయిన్. వి యశస్వి దర్శకత్వంలో జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మిస్తున్నారు. టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్ శుక్రవారం రెండో పాటను రిలీజ్ చేశారు.  

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అంటూ సాగే  పాటని నిర్మాత దిల్ రాజు విడుదల చేసి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. రథన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు యశస్వినే లిరిక్స్ రాశాడు. కార్తీక్, శ్రీనిషా కలిసి పాడారు. ఈ పాటలో దీపక్, తన్వి రొమాంటిక్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. నందిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.