కవితక్క కాళ్లు మొక్కు.. చిన్నారితో బీఆర్ఎస్ లీడర్ ఇలా..

కవితక్క కాళ్లు మొక్కు.. చిన్నారితో బీఆర్ఎస్ లీడర్ ఇలా..

పదేళ్ల చిన్నారి.. రాజకీయాలు తెలియవు.. ఏం జరుగుతుందో కూడా తెలియదు.. వేదికపైన ఉన్నదెవరో.. వాళ్ల స్థాయి ఏంటో తెలియదు.. అలాంటి చిన్న పాపతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాళ్లు మొక్కించారు ఆ పార్టీ నేతలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలతోపాటు.. స్కూల్  పిల్లలు కూడా తరలి వచ్చారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలతో పాటు.. చదువుల్లో రాణించిన విద్యార్థులను సత్కరించి  బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగానే ఓ  విద్యార్థిని.. కవిత చేతుల మీదుగా షీల్డ్ తీసుకుని వెళ్లిపోతుంది. అయితే పక్కనే ఉన్న.. ఓ బీఆర్ఎస్ నేత ఆ చిన్నారిని వెనక్కి పిలిచి.. ఎమ్మెల్సీ కవిత కాళ్లు మొక్కించారు. ఆ తర్వాత ఇదే కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ ఛైర్ పర్సన్ విజయ కూడా కవిత కాళ్లు మొక్కారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెడ్పీ చైర్మన్ అంటే వాళ్ల పార్టీ వాళ్లు.. వాళ్లు వాళ్లు ఎలా మొక్కుకుంటారు.. చిన్న పిల్లతో కాళ్లు మొక్కించటంపైనే నెటిజన్లు ఔరా అంటున్నారు.