
కర్నూలు: అప్పుడే పుట్టిన శిశువు(ఆడ)ను కాల్వలో పడేశారు కనికరంలేని మనుషులు. ఈ దారుణ సంఘటన శనివారం కర్నూలు జిల్లాలో జరిగింది. నంద్యాల శివారు చాబోలు గ్రామం వద్ద ఉన్న కేసీ కెనాల్ కాల్వ ఒడ్డున ఈ ఉదయం పసిపాప డెడ్ బాడీని గుర్తించారు గ్రామస్థులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. శుక్రవారం పుట్టిన శిశువును కాల్వలో పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిశువుకు ఉన్న ట్యాగ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.