
విశాఖలో ఘోరం జరిగింది. హాస్పిటల్‌లో చేర్చుకోకపోవడంతో.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి కన్నుమూసింది. అచ్యుతాపురానికి చెందిన ఏడాదిన్నర పాపకు కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో చిన్నారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. అయితే.. బెడ్స్ ఖాళీగా లేవంటూ.. చిన్నారిని హాస్పిటల్‌లో చేర్చుకోలేదు. దాంతో అంబులెన్స్‌లోనే గంటకు పైగా చిన్నారికి కృత్రిమ శ్వాస అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చిన్నారి అంబులెన్స్‌లోనే కన్నుమూసింది. చిన్నారిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు పడిన కష్టం.. చిన్నారి కన్నుమూశాక వారి రోధనలు చూసి.. అక్కడున్న వారు కూడా కన్నీరు పెట్టుకున్నారు.