
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఎల్బీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నడిరోడ్డుపై సడన్ గా డ్రైవర్ కారు డోర్ ఓపెన్ చేయడంతో బైక్ పై వెనుక నుండి వస్తున్న శశిరేఖ, సయ్యద్ దంపతులతో పాటుగా చిన్నారి ధనలక్ష్మి ఆ కారు డోర్ కు తాకి కింద పడిపోయారు. ఈ ఘటనలో చిన్నారి ధనలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందగా శశిరేఖ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఈ ఘటన జరగడంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల సూర్యపేట జిల్లాలో కూడా ఓ చిన్నారి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది. బొజ్జగూడెం గ్రామంలో పెళ్లి జరుగుతుండగా పెళ్లి వేడుకల్లో జరుగుతున్న బరాత్ ను చూసేందుకు బాణోతు ఇంద్రజ(9) అనే చిన్నారి కారు కిటీకిలో నుంచి తల బయటకు పెట్టింది. అయితే డ్రైవర్ శేఖర్ దీనిని గమనించకుండా కారు విండో గ్లాస్ ను పైకి ఎత్తాడు. దీంతో అందులో చిన్నారి మెడ ఇరుకోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయిం