V6 News

బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

చిన్న చింతకుంట/ మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : రాష్ట్రంలోని బాలల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్‌‌‌‌ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, మహబూబ్ నగర్ రూరల్ మండలాల్లోని కస్తూర్బా పాఠశాలలు, హాస్టళ్లను కమిటీ సభ్యులు అపర్ణ, వందన గౌడ్‌‌‌‌ తో కలిసి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవద్దని, చదువు మానేసి పనులకు వెళ్లకూడదని సూచించారు. చిన్నచింతకుంట కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణ పనులు ఆలస్యం కావడంపై సిబ్బందిని ఆరా తీశారు. మండలాల్లో మంజూరైన అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.