ఆ దేశంలో పిల్లలు మస్త్​ హ్యాపీ!

ఆ దేశంలో పిల్లలు మస్త్​ హ్యాపీ!

నెదర్లాండ్స్​​... సొగసైన దేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే లివింగ్ స్టాండర్డ్స్​ మెరుగ్గా ఉన్న దేశం కూడా. ఈ దేశంలోని ప్రజలు మిగతా దేశాల వాళ్లకంటే సంతోషంగా ఉంటారు. అందుకే దీనికి ‘హ్యాపీయెస్ట్​ కంట్రీ’గా  పేరుంది. ఈ దేశంలోని పిల్లలు కూడా ఇతరదేశాల పిల్లల కంటే చాలా సంతోషంగా ఉంటారని ఈమధ్య వచ్చిన యునెస్కో రిపోర్ట్​ చెప్తోంది. నెదర్లాండ్స్​లోని పిల్లలు అందరికంటే హ్యాపీగా ఉండడానికి కారణాలు కూడా చెప్పింది యునెస్కో. 

మంచీ, చెడూ చెప్తారు

నెదర్లాండ్స్​లోని ప్రజలు పిల్లల మాటకి విలువ ఇస్తారు. వాళ్ల ఆలోచనలు, అభిప్రాయాల్ని చెప్పనిస్తారు. అదే టైంలో...ఏది కరెక్ట్​, ఏది కరెక్ట్​ కాదు! అనేది చెబుతారు. ఇలాచేయడం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఏ విషయంలోనూ గొడవలు జరగవు. పిల్లలు కూడా భయం లేకుండా పేరెంట్స్​తో అన్ని విషయాలు షేర్​ చేసుకుంటారు. కన్నవాళ్లతో ప్రేమగా ఉంటారు. 

మాట్లాడే స్వేచ్ఛ

రిలేషన్​షిప్​ ఏదైనా కమ్యూనికేషన్​ చాలా ముఖ్యం. ఈ విషయంలో నెదర్లాండ్స్​లోని పిల్లలు చాలా లక్కీ. మిగతా దేశాల్లోని పిల్లలు కొన్ని విషయాలు అమ్మానాన్న​లతో మాట్లాడలేరు. కానీ,  ఈ దేశంలోని పిల్లలు ఏ విషయమైనా తల్లిదండ్రులతో ఓపెన్​గా మాట్లాడతారు. దాంతో కాన్ఫిడెంట్​గా ఉంటారు. పేరెంట్స్​తో చాలా క్లోజ్​గా, ఫ్రెండ్లీగా మూవ్​ అవుతారు. అంతేకాదు, తమకి నచ్చినట్టుగా ఉండే స్వేచ్ఛ ఉంది ఈ పిల్లలకి. 

కుటుంబం తర్వాతే...

నెదర్లాండ్స్​ ప్రజలు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా టైం తీసుకుని కుటుంబంతో కలిసి బయటికి వెళ్తారు. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తారు. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులిద్దరూ సమాన బాధ్యత తీసుకుంటారు. పిల్లల్ని చూసుకునేందుకు వాళ్లకి అఫీషియల్​ హాలిడేస్​ కూడా ఉంటాయి. అందుకే అక్కడి ప్రజలు పిల్లాపాపలతో హాయిగా ఉంటారు. పిల్లలు కూడా ఎప్పుడూ హ్యాపీగా కనిపిస్తారు. 

ఒత్తిడి చేయరు

స్కూల్, టీచింగ్​కి వస్తే... పిల్లల మీద ఒత్తిడి ఉండదు. పిల్లలు  కొత్త విషయాలు నేర్చుకోవాలి, అందరితో కలిసిపోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు. తమ పిల్లల భవిష్యత్తు గురించి టెన్షన్​ పడరు. పిల్లల్ని తమ వారసత్వానికి ప్రతీ కలుగా కాకుండా, వాళ్లని ఫ్రెండ్స్​లా చూస్తారు. బాగా చదవాలి, అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని పిల్లల్ని ఒత్తిడి చేయరు. తమ పిల్లలకి నచ్చిన దారి ఎంచుకునే ఫ్రీడమ్​ ఇస్తారు. 

డేటా ఎనలైజ్​ చేసి...

ప్రపంచంలో ఆదాయం ఎక్కువ ఉన్న 41 దేశాల్లోని పిల్లల సిచ్యుయేషన్​ స్టడీ చేసింది యునెస్కో. ఈ దేశాలకి చెందిన పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా? చురుకుగా ఉన్నారా? చదువులో, నలుగురిలో కలిసిపోవడంలో ముందుంటున్నారా? అనే వాటిమీద ఫోకస్​ పెట్టింది. డేటా సేకరించి ఎనలైజ్​ చేసింది. పై అన్ని విషయాల్లో నెదర్లాండ్స్​​ ఫస్ట్​​ ఉంది.​ ఆ తర్వాత డెన్మార్క్​ రెండో ర్యాంక్​, నార్వే మూడో ర్యాంక్​లో ఉన్నాయి.