డ్రగ్స్‌కు బానిసలు కాకుండా చూడాలె
V6 Velugu Posted on Dec 05, 2021
- రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రావు
హైదరాబాద్, వెలుగు: పిల్లలు డ్రగ్స్‌కు బానిసలు కాకుండా చూడాలని రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్ రావు సూచించారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్‍లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలను సక్రమ మార్గంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. డ్రగ్స్చట్టాలపై అవగాహన, డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్పరిణామాలపై వివరించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యుడు దేవయ్య, కమిషన్ సభ్యురాలు అపర్ణ, సిటీ సివిల్ కోర్ట్ సెక్రటరీ మురళి మోహన్ చౌహన్, రాధికా జైస్వాల్, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Tagged children, life style, drugs, Guided,