లిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడంతో కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ : అద్దంకి దయాకర్

లిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడంతో కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్  : అద్దంకి దయాకర్

నేతలకు సన్ స్ట్రోక్, డాటర్ స్ట్రోక్ కామన్ అని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. లిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడం వల్ల కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ వచ్చిందనాలని, గతంలో కరుణానిధి తన కుమార్తె కనిమొళి వల్ల డాటర్ స్ట్రోక్ కు గురయ్యారని చెప్పారు. నాయకుల పిల్లలు ఎప్పుడు ఆర్థిక వనరుల వైపే ఆలోచిస్తారన్నారు. తమ పార్టీలో రాహుల్, ప్రియాంక గాంధీ.. సోనియా, రాజీవ్ గాంధీ పిల్లలన్న ఆయన.. రాహుల్ గాంధీ ఫ్లయిట్​ ఖర్చులు కూడా పార్టీ భరించాల్సి వస్తోందని చెప్పారు. సోనియా ఇంటి అడ్రస్ అంటే 10 జన్ పథ్ అని, తమ పార్టీ అందరికీ ఆదర్శంగా ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల కుటుంబాలు స్కామ్ లల్లో ఇరుకుంటున్నాయన్నారు.

నేతలు, వారి కుటుంబాలు వ్యాపారాలు, క్యాసినో కేసుల్లో ఉంటున్నారని అద్దంకి దయాకర్ చెప్పారు. అమిత్ షాకు కొడుకు జయ్ షా వల్ల సన్ స్ట్రోక్  రాబోతుందన్న ఆయన.. వ్యాపారం చేసే కుటుంబాలు రాజకీయాల్లోకి రావడం ద్వారా ఈడీలు, సీబీఐ రైడ్స్ కు గురవుతున్నారన్నారు. సేవా రంగం పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు. వ్యాపారాన్ని వ్యాపారంగా.. సేవను సేవగా చూడాలని సూచించారు. అలా చేయకపోవడం వల్లే సన్ స్ట్రోక్ లకు గురవుతున్నారని చెప్పారు. ప్రజా సొమ్మును దోచుకోవడం, దాచుకోవడం కాదన్న ఆయన.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.