
సంచార కుటుంబాలు వారివి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ గుడిసెలు వేసుకొని కాలం వెళ్లదీస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఏరుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. తల్లిదండ్రులు వీధుల్లో ఏరుకొచ్చిన వస్తువులే వారి పిల్లలకు ఆటవస్తువులు. అలా ఏరుకొచ్చిన చెప్పులు, షూలు ఖమ్మం 8వ డివిజన్ ఎల్బీ నగర్ లో నాగార్జున సాగర్ కాల్వ పక్కన కుప్పగా పోయగా, వాటిపై పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు. – ఖమ్మం, వెలుగు ఫోటోగ్రాఫర్