
చొప్పదండి, వెలుగు: వానలు పడాలని చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో ఆదివారం చిన్నారులు కప్పతల్లి ఆట ఆడారు. వానకాలం మొదలై నెల దాటినా సరిగా వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ పనులు జోరుగా సాగడంలేదు. దీంతో ఒక కర్రకు గుడ్డలో కప్పను కట్టి ఉంచి, ఆ కర్రను చిన్నారులు భుజంపై వేసుకొని గ్రామంలో డప్పుచప్పుళ్లతో ఇంటింటికి తిరిగారు. వానదేవుడిని ప్రార్థిస్తూ ప్రజలు వారికి జలాభిషేకం చేశారు.
కోనరావుపేట, వెలుగు: వానలు పడాలని కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో రైతులు గ్రామ దేవతలకు రైతులు ఆదివారం జలాభిషేకం చేశారు. గ్రామంలోని మహదేవుని ఆలయంతోపాటు పలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మెన్ అనుపాటి భూమిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.