జగిత్యాలలో పోలీసులకు రాఖీలు కట్టిన చిన్నారులు

జగిత్యాలలో పోలీసులకు రాఖీలు కట్టిన చిన్నారులు

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్కూల్ స్టూడెంట్స్ పోలీసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ రాఖీ పండగ తోబుట్టువుల ఆత్మీయ బంధానికి ప్రతీక అని కొనియాడారు. 

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో గురువారం రాఖీ పండుగను నిర్వహించారు. కొదురుపాక, బోయినిపల్లి, కోరెం, విలాసాగర్ తదితర ప్రాథమిక స్కూళ్లలో బాలికలు బాలురకు రాఖీలు కట్టారు. అనంతరం టీచర్లు విద్యార్థులకు స్వీట్స్  పంపిణీ చేశారు.