- బీరువా మాత్రమే ఎత్తుకెళ్లడంతో కీలక ఫైల్స్ మాయం
సూర్యాపేట/కోదాడ,వెలుగు: సూర్యాపేట జిల్లా చిలుకూరు తహసీల్దార్ ఆఫీసులో దొంగలు పడ్డారు. విలువైన సామగ్రి వదిలిపెట్టి.. ఒక్క బీరువానే ఎత్తుకెళ్లారు. పక్కనే పోలీసు స్టేషన్ ఉన్నా అధికారులు ఫిర్యాదు చేయలేదు. ఇంటి దొంగల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తహసీల్దార్ ఆఫీసులో సుదీర్ఘకాలంగా పనిచేసే ఆఫీసర్ బీసీ, ఓసీ, ఎస్టీ, ఎస్సీ కమ్యూనిటీ ఫేక్ సర్టిఫికెట్లను మంజూరు చేశాడు. రూ. లక్షల్లో తీసుకున్నాడు. కొందరు సిబ్బందిని కూడా తన దందాలో భాగస్వామ్యం చేశాడు. ఇలా చాలామంది కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను పొందారు. కాగా.. బీసీ మహిళా పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ కేటగిరీ నుంచి పోటీ చేయడంతో దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్ విచారణ చేయించి ఆమె సర్టిఫికెట్ ను రద్దు చేశారు. ఇలా పలువురు కూడా అక్రమంగా సర్టిఫికెట్లు పొందినట్టు సమాచారం.
