వృద్ధుడి మెడలోని 3 తులాల బంగారాన్ని కొట్టేసిన బార్బర్

వృద్ధుడి మెడలోని 3 తులాల బంగారాన్ని కొట్టేసిన బార్బర్
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

మల్కాజిగిరి, వెలుగు: హెయిర్​ కటింగ్​కోసం సెలూన్​కు వెళ్లిన వృద్ధుడి మెడలో బంగారాన్ని కొట్టేసిన వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జగదీశ్వర్​రావు తెలిపిన వివరాలు ప్రకారం.. పటేల్ నగర్​లో ఉండే తమ్మునూరి నర్సింగ్ రావు(32) స్థానికంగా ఉన్న రాఘవేంద్ర సెలూన్ లో బార్బర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న వెంకటేశ్వర నగర్​కు చెందిన రిటైర్డ్​ రైల్వే ఎంప్లాయ్ ఆరవెల్లి సిద్ధయ్యగౌడ్​(87) హెయిర్ కటింగ్ కోసం రాఘవేంద్ర సెలూన్​కు వెళ్లాడు. కటింగ్ చేస్తూ వృద్ధుడిని మాటల్లో పెట్టిన నర్సింగ్ రావు అతడి మెడలోని 3 తులాల బంగారు చైన్​ను కొట్టేశాడు.

కటింగ్ అయిపోయిన తర్వాత సిద్ధయ్య  బయటికి వచ్చాడు. మెడలో చైన్ కనిపించకపోవడంతో మళ్లీ సెలూన్ లోకి వెళ్లి అడగగా.. తాను చూడలేదని నర్సింగ్ సమాధానం ఇచ్చాడు. నర్సింగ్ రావుపై అనుమానంతో సిద్ధయ్య పోలీసులకు కంప్లయింట్ చేశాడు. బార్బర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తానే చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. నర్సింగ్ రావు దగ్గరి నుంచి 3 తులాల గోల్డ్ చైన్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు గురువారం అతడిని రిమాండ్​కు తరలించారు.