లడఖ్‌‌లో మా జవాన్లూ చనిపోయారు.. ఒప్పుకున్న చైనా

లడఖ్‌‌లో మా జవాన్లూ చనిపోయారు.. ఒప్పుకున్న చైనా

న్యూఢిల్లీ: గతేడాది గల్వాన్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరు దేశాల ఆర్మీలో కొంతమంది జవాన్లు చనిపోయారు. ఎంత మంది సోల్జర్స్ అమరులయ్యారనే వివరాలను భారత ప్రభుత్వం వెల్లడించింది. కానీ తమ సైనికుల్లో ఎంత మంది మరణించారనే వివరాలను చైనా మాత్రం ప్రకటించలేదు. అయితే ఎట్టకేలకు ఈ ఘటనపై డ్రాగన్ కంట్రీ క్లారిటీ ఇచ్చింది.

గల్వాన్ వ్యాలీలో భారత జవాన్లతో జరిగిన ఘర్షణలో తమ సైనికులూ చనిపోయారని చైనా ఒప్పుకుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌‌ఏ)కు చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారని తెలిపింది. కారక్కోరం పర్వతాల్లో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన తమ జవాన్ల సేవలు అపురూపమని చైనా ప్రభుత్వ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ శుక్రవారం రాసుకొచ్చింది. ఆ ఘటనలో చనిపోయిన జవాన్ల పేర్లు చెన్ హోంగ్జున్, చెన్న జిన్‌‌గ్రాంగ్, జియావో సియావున్, వాంగ్ జురాన్‌‌గా చైనా గుర్తించిందని రాయిటర్స్ రిపోర్ట్ వెల్లడించింది. వీరిలో చెన్ హోంగ్జూన్‌‌కు ‘హీరో ఆఫ్ డిఫెండ్ ది బార్డర్’ టైటిల్‌‌తో చైనా సత్కరించిందని స్పష్టం చేసింది.