చైనాలోని 13 సిటీల్లో పూర్తి లాక్‌‌‌‌డౌన్‌‌‌‌

చైనాలోని 13 సిటీల్లో పూర్తి లాక్‌‌‌‌డౌన్‌‌‌‌
  • చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్
  • ఒక్కరోజులోనే 5,280 కేసులు
  • కరోనా తొలి రోజులు మళ్లీ కనిపిస్తున్నయని టెన్షన్

బీజింగ్‌‌‌‌/వాషింగ్టన్‌‌‌‌/న్యూఢిల్లీ: చైనాను కరోనా మళ్లీ వణికిస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 5,280 కేసులు వచ్చాయి. ఇది సోమవారంతో పోలిస్తే రెట్టింపు అని అధికారులు వెల్లడించారు. వైరస్‌‌‌‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో చైనాలోని పలు ప్రాంతాల్లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించారు. దీంతో దాదాపు 3 కోట్ల మంది ఇండ్లకే పరిమితయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. హెల్త్‌‌‌‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఎక్కడికక్కడ టెస్ట్‌‌‌‌లు చేస్తున్నారు. కరోనా తొలినాటి రోజులు మళ్లీ చైనాలో కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్‌‌‌‌ వేరియంట్‌‌‌‌ వేగంగా వ్యాపిస్తుండటంతో అక్కడ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కడైనా ఒక్క కరోనా కేసు నమోదైనా ఆయా ప్రాంతాల్లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పెట్టాలన్న ‘‘జీరో కొవిడ్‌‌‌‌” వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీంతో మంగళవారం 13 సిటీల్లో పూర్తి లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను అమలు చేస్తున్నారు. జిలిన్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో ఒక్కరోజులో 3 వేల కొత్త కేసులు వచ్చాయి. దీంతో జిలిన్‌‌‌‌ రాజధాని అయిన చాంగ్‌‌‌‌చున్‌‌‌‌లో 90 లక్షల మంది లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఉన్నారు. టెక్‌‌‌‌ హబ్‌‌‌‌గా పేరొందిన షెన్‌‌‌‌జెన్‌‌‌‌ సిటీలో మూడ్రోజుల నుంచి లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ అమల్లో ఉంది. ఆ సిటీలో మొత్తం కోటి 75 లక్షల మంది ఇండ్లకే పరిమితమయ్యారు. షాంఘైలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయి. పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. బీజింగ్‌‌‌‌, షాంఘైలో పదుల సంఖ్యలో డొమెస్టిక్‌‌‌‌ ఫ్లైట్లను రద్దు చేశారు. మళ్లీ వైరస్‌‌‌‌ ఉధృతిలో దేశ వృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

అమెరికాలో మళ్లీ మోపైతాందా? 
అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ మోపైతాందా? కేసులు పెరుగుతున్నాయా? అంటే ఓ స్టడీ అవుననే సిగ్నల్స్​ఇస్తోంది. డ్రైనేజీ నీళ్ల శాంపిళ్లను స్టడీ చేసిన యూఎస్​ సెంటర్స్ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​(సీడీసీ) సైంటిస్టులు కరోనా కేసులు పెరుగుతున్నాయన్న హెచ్చరిక చేశారు. మార్చి 1 నుంచి మార్చి 10 మధ్య డ్రైనేజీ నీళ్లను పరిశీలించిన వారు.. ఆ నీళ్లలో కరోనా వైరస్​ మూలాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10తో పోలిస్తే ఇప్పుడు డ్రైనేజీ నీళ్లలో వైరస్​ మూలాలు రెట్టింపయ్యాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఎన్ని కేసులు వస్తున్నాయన్న దానిని, దాని వల్ల మరో వేవ్​ వస్తుందా? రాదా? అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. స్టడీలో భాగంగా 530 డ్రైనేజీ మానిటరింగ్​ సైట్స్​ నుంచి తీసుకున్న శాంపిళ్లను సైంటిస్టులు పరిశీలించారు.