బార్డర్‌‌‌‌‌‌‌‌లో 5జీ నెట్ వర్క్ సిద్ధం చేస్తోన్న చైనా

బార్డర్‌‌‌‌‌‌‌‌లో 5జీ నెట్ వర్క్ సిద్ధం చేస్తోన్న చైనా

డెమ్‌చొక్‌ ప్రాంతంలో ఏర్పాటు
చర్చలు జరుగుతుండగానే పాంగాంగ్‌‌‌‌‌‌‌‌ దగ్గర నిర్మాణాలు
ఆగస్టు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వీక్‌లోనే పనులు స్టార్ట్
ఎల్‌ఏసీ దగ్గర భారీగా మిలటరీని దింపుతున్న ఇండియా

న్యూఢిల్లీ: ఓ వైపు ఇండియా, చైనా బార్డర్‌ ‌‌‌‌‌‌‌సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతుండగానే మరోవైపు లైన్‌‌‌‌‌‌‌‌ఆఫ్‌ యాక్చు వల్‌ కంట్రోల్‌(ఎల్‌ఏసీ) వెంబడి డ్రాగన్‌‌‌‌‌‌‌‌ కంట్రీ కొత్త నిర్మాణాలు చేపడుతోంది. పాంగాంగ్‌ లేక్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో డెమ్‌చొక్‌‌‌‌‌‌‌‌ దగ్గర 5జీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ సెటప్‌ ఏర్పాటును వేగవంతం చేసింది. ఎల్‌ఏసీ వెంబడి మంచి కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ కోసం ఆగస్టు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌ నుంచే ఆ దేశం ఈ పని స్టార్ట్‌ ‌‌‌‌‌‌‌చేసిందని మన ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంటున్నాయి. పాంగాంగ్‌ లేక్‌‌‌‌‌‌‌‌వెంబడి సైనికుల పహారా, కొత్త గుడారాలు వెలుస్తున్నాయంది. చైనా అలజడి పెరగడంతో ఇండియా కూడా భారీ సైన్యాన్ని మోహరిస్తోంది. గతంలో ఉన్న సైన్యం కంటే మూడు రెట్లు ఎక్కువగా లడఖ్ బార్డర్‌‌‌‌‌‌‌‌కు ఇప్పటికే తరలించింది. యుద్ధప్రాతిపదికన బార్డర్‌‌‌‌‌‌‌‌లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది. బార్డర్‌‌‌‌‌‌‌‌లో పరిస్థితి మారనంత వరకు బలగాల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని ఓ ఆర్మీ అధికారి తెలిపారు.

ఫింగర్‌‌‌‌‌‌‌‌ 5,8 దగ్గర గుడారాలు
పాంగాంగ్‌ సరస్సు వెంబడి డ్రాగన్‌‌‌‌‌‌‌‌ బలగాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. జస్ట్‌ ‌‌‌‌‌‌‌ఫింగర్ ‌‌‌‌‌‌‌‌4 దగ్గర మాత్రమే కాస్త వెనక్కి జరిగినట్లు తెలిసింది. మరోవైపు ఫింగర్‌ 5,8 ఏరియాల్లో తన బలాన్ని చైనా మరింత పెంచుకున్నట్లు సమాచారం. చలికాలం దగ్గరకు వస్తున్నందున ఇప్పటికే పెద్దసంఖ్యలో పడవలు తరలించి గుడారాలు కట్టడం స్టార్ట్‌ ‌‌‌‌‌‌‌చేసినట్టు సమాచారం. ఫింగర్‌‌‌‌‌‌‌‌4 దగ్గర కాస్త పరిస్థితి సద్దుమణగడంతో బలగాలను ఇండియా వెనక్కి రప్పించినా అటువైపు నుంచి సరైన రెస్పాన్స్‌ లేకపోవడంతో ఏప్రిల్‌ నాటి పరిస్థితిని కొనసాగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక పాంగాంగ్‌ లేక్‌‌‌‌‌‌‌‌నుంచి వెనక్కి వెళ్లాలంటే ఇండియా కూడా తన బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని చైనా డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తోందని, అలా చేస్తే ఇప్పటికే పట్టున్న ప్రాంతాన్ని మనం కోల్పోయినట్టు అవుతుందని ఓ అధికారి వివరించారు.

గోగ్రా హాట్‌‌‌‌‌‌‌‌ స్పింగ్‌‌‌‌‌‌‌‌ దగ్గర ఇంకా అట్లనే..
జూన్‌‌‌‌‌‌‌‌లో గల్వాన్‌‌‌‌‌‌‌‌ లోయలో ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీంతో సమస్య పరిష్కారానికి 2 దేశాల మధ్య డిప్లొమాటిక్‌, మిలిటరీ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. బలగాల ఉపసంహరణపై ఇప్పటికే ఐదుసార్లు కార్ప్స్‌ కమాండర్‌‌‌‌‌‌‌‌ స్థాయి చర్చలు జరగ్గా త్వరలోనే మరోమారు మిలటరీ అధికారుల భేటీ జరగొచ్చని తెలిసింది. ఘర్షణకు కారణమైన గల్వాన్‌‌‌‌‌‌‌‌, పెట్రోల్‌పాయింట్‌‌‌‌‌‌‌‌ 15, పాంగాంగ్‌‌‌‌‌‌‌‌ నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గినా గోగ్రా హాట్‌‌‌‌‌‌‌‌ స్పింగ్స్‌ ఏరియా దగ్గర మాత్రం పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. అందుకే చర్చలు సఫలం కాకపోతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌‌‌‌‌‌‌‌ రావత్‌ హెచ్చరికలు జారీ చేశారు.

For More News..

కరోనా నివారణకు ఈ దూరం చాలదట

అమెరికాలో హరికేన్ లారా బీభత్సం

10 గంటలకు పైగా రియా విచారణ