
China Defence Stocks: ప్రస్తుతం పాకిస్థాన్ చేసిన పనితో చైనాకు సంబంధించిన అనేక డిఫెన్స్ స్టాక్స్ నేలకూలుతున్నాయి. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియాపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఇచ్చిన మందుగుండు, యుద్ధ విమానాలు మేడ్ ఇన్ ఇండియా మిసైళ్ల ముందు నిలవలేక తుస్సుమన్న దీపావళి టపాసుల్లా మారాయి. గతంలో అమెరికా ఇచ్చిన ఎఫ్-16 ఫైటర్ జెట్ ను ఒక మిగ్ విమానం కూల్చివేయటంతో వాటిని అందించిన అమెరికా పరువు కూడా పోయింది.
ఈ క్రమంలోనే యుద్ధంలో పాకిస్థాన్ ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్లు, మిస్సైళ్లు ఫెయిల్ కావటంతో అంతర్జాతీయంగా చైనా కంపెనీల రక్షణ ఉత్పత్తులపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో ఇప్పటికే చైనాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని ఆఫ్రికా దేశాలు వాటిని క్యాన్సిల్ చేసుకునే పనిలో ఉండగా.. చైనాలోని ఇన్వెస్టర్లు సైతం సదరు కంపెనీల షేర్లను భారిగా విక్రయించటంతో ప్రస్తుతం అవి పతనం అవుతున్నాయి. ఈ క్రమంలో నేడు చైనా డిఫెన్స్ సూచీ 3 శాతం పతనాన్ని చూసింది.
ప్రధానంగా AVIC Chengdu, Zhuzhou Hongda కంపెనీల షేర్లు 6 నుంచి 9 శాతం మధ్య పతనాన్ని నమోదు చేశాయి. ఎందుకంటే AVIC Chengdu సంస్థ పాకిస్థాన్ కి జే 10సి ఫైటర్ విమానాలను అందించింది. వీటిని ఆపరేషన్ సిందూర్ సమయంలో వినియోగించినట్లు పాక్ విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది కూడా. అలాగే Zhuzhou Hongda అందించిన పీఎల్ 15 మిస్సైళ్లను సైతం పాక్ భారత్ పై దాడిలో ఉపయోగించిందని వెల్లడైంది. 2020-24 మధ్య కాలంలో దాదాపు 80 శాతం తన ఆయుధాలను పాక్ చైనా నుంచే కొనుగోలు చేయటం గమనార్హం. ఇదే సమయంలో పాక్ కొన్ని డ్రోన్లలను టర్కీ, నెథర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు వెల్లడైంది.
వాస్తవానకి AVIC Chengdu సంస్థ చైనాకు చెందిన అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఉత్పత్తిదారు. ఇది డిజైన్ నుంచి ఉత్పత్తి వరకు చైనాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్, ఇతర ఆయుధాలను పర్యవేక్షిస్తుంటుంది. ప్రస్తుతం ఇదంతా చూస్తున్న వారు వాస్తవానికి చైనా ఆయుధాల్లో విషయం లేదా లేక వాటిని వాడటం పాక్ ఆర్మీకి తెలియటం లేదా అంటూ జోక్స్ వేసుకుంటున్నారు.