
-
30 శాతం సుంకం రద్దు
న్యూఢిల్లీ: చైనా భారత ఫార్మా ప్రొడక్ట్‌లపై 30శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీంతో ఇండియన్ ఫార్మా కంపెనీలు జీరో టారిఫ్‌కే చైనాకు తమ మందులను ఎగుమతి చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో చైనాకు రూ.లక్షల కోట్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 100శాతం ఫార్మా టారిఫ్ విధించిన వెంటనే ఈ ప్రకటన రావడం గమనార్హం.
యూఎస్ మార్కెట్ ఖరీదైనదిగా మారుతున్న నేపథ్యంలో, చైనా నిర్ణయం భారత కంపెనీలకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా నిలుస్తుంది. తాజా నిర్ణయంతో ఇండియా–చైనా మధ్య ట్రేడ్ బ్యాలెన్స్ మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. భారత ఔషధ రంగంలో వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని, ఆర్థిక వృద్ధి, గ్లోబల్ హెల్త్‌కేర్ చెయిన్‌లో భారత స్థానం బలపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయని అన్నారు.