తైవాన్ చుట్టూ.. డ్రాగన్ పనిష్మెంట్

తైవాన్ చుట్టూ.. డ్రాగన్  పనిష్మెంట్

 

  • కొత్త అధ్యక్షుడి ప్రసంగంతో రెచ్చిపోయిన చైనా

న్యూఢిల్లీ:  తైవాన్ ను చైనా మళ్లీ కవ్వించింది. గురువారం ఆ దేశం చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. తైవాన్ కొత్త  ప్రెసిడెంట్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన లాయ్  చింగ్  తే  ప్రసంగిస్తూ.. తమను బెదిరించడం మానుకోవాలని చైనాకు స్పష్టం చేశారు. ‘‘మమ్మల్ని భయపెట్టడం ఆపండి. మా సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు. మా దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యానికి మేము కట్టుబడి ఉన్నాం” అని ఆయన తేల్చిచెప్పారు. దీంతో చైనా రెచ్చిపోయింది. గురువారం ఉదయం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్  ఫోర్స్ తో తైవాన్  చుట్టూ సైనిక ప్రదర్శనలు చేసింది. ‘పనిష్మెంట్’ పేరుతో ఈ విన్యాసాలు నిర్వహించింది. తైవాన్  బలగాల వేర్పాటువాద చర్యలకు శిక్షగా తాము సైనిక విన్యాసాలు చేపట్టామని పేర్కొంది.  
తైవాన్  బలగాలు అప్రమత్తం చైనా సైనిక విన్యాసాలపై తైవాన్ అప్రమత్తమైంది. వెంటనే తమ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్  బలగాలను తరలించింది. ఉద్దేశపూర్వకంగానే చైనా తమను రెచ్చగొడుతోందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బ తీస్తున్నదని డ్రాగన్ కంట్రీపై మండిపడింది.