చైనాను వణికిస్తున్న కోవిడ్ కేసులు 

చైనాను వణికిస్తున్న కోవిడ్ కేసులు 

చైనాలో కోవిడ్ కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 వేల 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేనివారిలో కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా రాజధాని బీజింగ్ లో సిటీ పార్కులను మూసివేశారు. అలాగే పలు కోవిడ్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. అలాగే స్కూల్స్ కూడా మూతబడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. షాపులు, రెస్టారెంట్లు కూడా బంద్ అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు పరుస్తుంది. 

గాంగ్‌ఝౌ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ కొద్దిరోజులుగా రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న హైఝులో ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడంతో ఆదివారం వరకు కఠిన లాక్‌డౌన్ విధించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంట్లో ఒక్కరు మినహా ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.