
బిజినెస్ డెస్క్, వెలుగు: గత 20 ఏళ్లలో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగింది. అమెరికాను దాటేసి చైనా మొదటి ప్లేస్‌కు దూసుకెళ్లింది. రిసెర్చ్ కంపెనీ మెకిన్సే అండ్ కో తాజాగా ఈ రిపోర్టును విడుదల చేసింది. ప్రపంచ ఆదాయంలో 60 శాతం వాటా ఉన్న పది దేశాల బాలెన్స్ షీట్లను ఈ రిపోర్టు కోసం స్టడీ చేసినట్లు మెకిన్సే వెల్లడించింది. మునుపెన్నడూ లేనంత సంపన్నులమయ్యామని మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ (జ్యూరిచ్) పార్టనర్జాన్ మిస్చెక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
గ్లోబల్ నెట్‌వర్త్ 514 ట్రిలియన్ డాలర్లు..
2020లో ప్రపంచ వ్యాప్తంగా నెట్‌వర్త్ 514 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నెట్‌వర్త్ 2000 సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లు మాత్రమేనని స్టడీ పేర్కొంది. సంపద పెరుగుదలలో మూడో వంతు చైనా నుంచే రావడం విశేషం. 2000 సంంత్సరంలో కేవలం 7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న చైనా సంపద 2020 నాటికి ఏకంగా 120 ట్రిలియన్ డాలర్లయ్యింది.
అమెరికాలో ప్రాపర్టీ రేట్లు పెరగలే..
ప్రాపర్టీ రేట్లు పెద్దగా పెరగకపోవడం వల్ల అమెరికా సంపద విషయంలో కొంత వెనకబడిపోయిందని స్టడీ తెలిపింది. 20 ఏళ్ల కాలంలో అమెరికా నెట్‌వర్త్ రెట్టింపయి 90 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా, చైనా దేశాలు రెండింటిలోనూ మొత్తం సంపదలో మూడింట రెండొంతులు కేవలం 10 శాతం హౌస్‌హోల్డ్స్ వద్దే ఉన్నట్లు కూడా స్టడీ తేల్చింది. ఈ 10 శాతం హౌస్‌హోల్డ్స్ వాటా బాగా పెరుగుతున్నట్లు పేర్కొంది. మెకిన్సే లెక్కించిన ప్రకారం గ్లోబల్ నెట్‌వర్త్‌లో 68 శాతం రియల్ ఎస్టేట్‌లోనే ఉంది. మిగిలినది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషినరీ అండ్ ఎక్విప్‌మెంట్, చాలా చిన్న మొత్తం ఇంటలెక్చువల్ప్రోపర్టీ, పేటెంట్లలోనూ ఉందని మెకిన్సే రిపోర్టు వెల్లడించింది. గ్లోబల్ వెల్త్కేలిక్యులేషన్స్లో ఫైనాన్షియల్ ఎసెట్స్‌ను లెక్కలోకి తీసుకోలేదు. ఎందుకంటే వాటికి సమానమైన లయబిలిటీస్ కూడా ఉండటమే దానికి కారణమని మెకిన్సే వివరించింది. ఉదాహరణకు, ఒక ఇండివిడ్యువల్ చేతిలోని కార్పొరేట్ బాండ్ ఆ వ్యక్తికి ఎసెట్ అయితే, ఆ కంపెనీకి అది లయబిలిటీ అవుతుంది.
జీడీపీ కంటే నెట్‌వర్త్ ఎక్కువ పెరిగింది..
గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పెరుగుదల కంటే ఎక్కువగా నెట్‌వర్త్ పెరిగిందని మెకిన్సే రిపోర్టు తెలిపింది. ప్రోపర్టీ రేట్లు భారీగా పెరగడంతోపాటు, వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే దీనికి కారణమని వెల్లడించింది. ఆదాయాల లాంగ్ టెర్మ్ యావరేజ్‌తో పోలిస్తే ఎసెట్ రేట్లు 50 శాతం ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ వెల్త్బూమ్నిలబడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోందని మెకిన్సే తెలిపింది. ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా నెట్‌వర్త్ పెరగడమనేది చాలా ప్రశ్నలకు దారిస్తోందని మిస్చెక్ అన్నారు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
క్రైసిస్‌కు దారి..
రియల్ ఎస్టేట్ రేట్లు భారీగా పెరగడం వల్ల చాలా మంది ప్రజలు ఇండ్లు కొనుక్కోలేరని, ఫలితంగా ఫైనాన్షియల్ క్రైసిస్ బారిన పడే రిస్క్ ఎక్కువవుతుందని మెకిన్సే రిపోర్టు అభిప్రాయపడింది. 2008 నాటి అమెరికాలోని హౌసింగ్ బబుల్ బద్దలవడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పింది. చైనాలోని ఎవర్‌గ్రాండె గ్రూప్ వంటి ప్రోపర్టీ డెవలపర్ల భారీ అప్పుల వల్ల చైనా కూడా ఇలాంటి ట్రబుల్‌లో పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. గ్లోబల్ జీడీపీ పెరిగేందుకు మరిన్ని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్లు ఆవశ్యకమని, అప్పుడు ప్రపంచ సంపద వేరుగా ఉంటుందని మెకిన్సే రిపోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ ఎసెట్ల రేట్లు కుప్పకూలితే గ్లోబల్ వెల్త్‌లో మూడో వంతు కనుమరుగవుతుందని కూడా పేర్కొంది.