నెల రోజుల్లోనే అలర్ట్ చేశాం..కరోనాపై చైనా వైట్ పేపర్

నెల రోజుల్లోనే అలర్ట్ చేశాం..కరోనాపై చైనా వైట్ పేపర్

బీజింగ్:  ‘‘కరోనా వైరస్ ను మొదటిసారిగా డిసెంబర్ 27, 2019న వుహాన్ లో వైరల్ న్యుమోనియాగా గుర్తించినం. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని జనవరి19న తెలిసింది. ఆ వెంటనే వైరస్ ను అడ్డుకునేందుకు వేగంగా చర్యలు తీసుకున్నం..” అని చైనా వెల్లడించింది. కరోనా గురించి చైనా ఆలస్యంగా చెప్పిందని, కావాలనే నిర్లక్ష్యం చేసిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ ఈ విషయంపై సుదీర్ఘ వివరణనిస్తూ ఆదివారం ఒక వైట్ పేపర్ ను విడుదల చేసింది. వైరస్ ను గుర్తించింది మొదలు, ప్రపంచ దేశాలను అలర్ట్ చేయడం వరకూ అనేక విషయాలను ఇందులో వివరించింది. మొదట అంతుచిక్కని వైరల్ న్యుమోనియాగా దీనిని గుర్తించామని, ఆ వెంటనే వేగంగా చర్యలు తీసుకున్నామని చైనా సర్కారు తన వైట్ పేపర్ లో పేర్కొంది. అయితే, కరోనాపై పోరులో చైనాను డబ్ల్యూహెచ్ వో మెచ్చుకుంటున్నా, వైరస్ ను అరికట్టేందుకు కావలిసిన సమాచారాన్ని డ్రాగన్ కంట్రీ తగినంతగా అందించలేదని డబ్ల్యూహెచ్ వో ఆఫీసర్లు అంతర్గతంగా అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అందుకే చైనా సర్కారు కరోనాపై వైట్ పేపర్ ను విడుదల చేసిందని భావిస్తున్నారు.

వైట్ పేపర్ లో ఏం చెప్పిందంటే…

  • వుహాన్ లో మొదటి కరోనా కేసును ఐడెంటిఫై చేసిన వెంటనే.. లోకల్ గవర్నమెంట్ దీనిపై ఒక నిపుణుల కమిటీని నియమించింది. టెస్టుల రిజల్ట్స్, పేషెంట్ల కండిషన్, ట్రీట్ మెంట్, వ్యాధికి సంబంధించిన లక్షణాల వంటివాటిని ఈ కమిటీ అనలైజ్ చేసింది. చివరగా దీనిని వైరల్ న్యుమోనియా అని తేల్చింది. ఆ తర్వాత దీనిపై నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్ హెచ్ సీ)కి చెందిన హైలెవల్ ఎక్స్ పర్ట్ టీమ్ రీసెర్చ్ చేసింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్ అని జనవరి19న కన్ఫమ్ అయింది. ఈ కొత్త వ్యాధి గురించి ఒక నెల రోజులలోపే నిపుణులు అలర్ట్ చేశారు.
  • ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందనడానికి జనవరి 19 కంటే ముందు ఎవిడెన్స్ దొరకలేదని ఎన్​హెచ్​సీ కమిటీలోని చైనీస్ రెస్పిరేటరీ ఎక్స్ పర్ట్ వాంగ్ గ్వాంగ్ఫా కన్ఫమ్ చేశారు.
  • జనవరి 14నాటికి కూడా వైరస్ మనుషులకు సోకే విషయంపై ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. మరోవైపు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో వుహాన్ తో పాటు మొత్తం హుబే ప్రావిన్స్ అంతటా వైరస్ ను నివారించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాలని ఎన్ హెచ్ సీ సూచించింది. చివరగా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని రెండు కేసులపై ఇన్వెస్టిగేషన్ ద్వారా జనవరి 20న ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందని తేలినట్లు ఎక్స్ పర్ట్ కమిటీ మెంబర్ ఝాంగ్ నాన్షాన్ కన్ఫమ్ చేశారు.
  • వుహాన్ తో పాటు హుబే ప్రావిన్స్ లో కారణం తెలియకుండా, న్యుమోనియా కేసులు పెరగడాన్ని గుర్తించిన వెంటనే చైనా సర్కారు వెంటనే స్పందించింది. తక్షణమే ఎపిడెమియోలజికల్, ఇషియోలజికల్ ఇన్వెస్టిగేషన్లకు ఆదేశించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే, వ్యాధిని కంట్రోల్​ చేయడానికి చర్యలు తీసుకుంది. ఆ తర్వాత డబ్ల్యూహెచ్ వో, అమెరికాతో పాటు అన్ని దేశాలకు ఈ వైరస్ గురించి చైనా సమాచారం ఇచ్చింది. కరోనా వైరస్​పై రీసెర్చ్​లకు వీలుగా దాని జీనోమ్ సీక్వెన్స్ ను కూడా రిలీజ్ చేసింది.
  • మొదట వుహాన్​లో కమ్యూనిటీ స్ప్రెడ్, కేసుల క్లస్టర్లను గుర్తించారు. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చేసిన వారి వల్ల కూడా వైరస్ వ్యాపిస్తున్నట్లు కనుగొన్నారు. దీంతో  వెంటనే దేశవ్యాప్తంగా ఎపిడెమిక్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రోగ్రాం ప్రారంభమైంది.
  • జనవరి 3న అంతుచిక్కని న్యుమోనియాగా వైరస్ ను గుర్తించినప్పటి నుంచే ఈ విషయంపై డబ్ల్యూహెచ్ వోకు చైనీస్ ఆరోగ్య సంస్థలు సమాచారం ఇవ్వడం ప్రారంభించాయి. ఒకరోజు తర్వాత నుంచి అమెరికాకూ ఇన్ఫర్మేషన్ అందించాయి.
  • ‘‘అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ఉండి, పరిష్కారం కనుగొనాలి.  సాలిడారిటీయే బలం. ప్రపంచం ఈ పోరాటంలో గెలుస్తుంది..” అని వైట్ పేపర్ ను చైనా సర్కారు ముగించింది.

ఎవిడెన్స్‌ లేదు: వాంగ్‌ టీం

ఎక్స్ పర్టులు వుహాన్​లో దిగిన టైంలో, చాలామంది ఫీవర్ పేషెంట్లు ఉన్నారు. కరోనా ప్రారంభమైనట్లు చెప్తున్న హునాన్ మార్కెట్​కు వెళ్లనివాళ్లకు కూడా వైరస్ సోకినట్లు తెలిసింది. గబ్బిలాలు, పంగోలిన్​(అలుగు)ల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకి నట్లు భావిస్తున్నా, ఇందుకు తగిన ఎవిడెన్స్ లేదని వాంగ్ టీం తేల్చింది. అయితే, ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకుంటే, అనూహ్యమైన పరిణామా లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, ఈ వైరస్ మనుషుల నుంచి మనుషుల కు సోకుతుందా? అనే విషయాన్ని సైంటిస్టులకు వదిలేశారు.

సోనూ’ సాయం వెనుక పాలిటిక్స్‌