పాకిస్తాన్ కు చైనా గట్టి సపోర్ట్! ..పాక్ విదేశాంగ శాఖ వెల్లడి

పాకిస్తాన్ కు చైనా గట్టి సపోర్ట్! ..పాక్ విదేశాంగ శాఖ వెల్లడి

బీజింగ్: చైనా తమకు పూర్తి మద్దతు ప్రకటించిందని శనివారం రాత్రి కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఫోన్ లో మాట్లాడారని, తాజా పరిస్థితిని వివరించారని ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఆఫీస్ తెలిపింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు పాక్ చేస్తున్న పోరాటంలో చైనా పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా వాంగ్ యీ హామీ ఇచ్చారని పేర్కొంది. 

అలాగే టర్కీ ఫారిన్ మినిస్టర్ హకన్ ఫిదాన్ తోనూ ఇషాక్ దార్ మాట్లాడారని, ప్రాంతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని వివరించారని వివరించింది. కాగా, భారత్, పాకిస్తాన్ పరస్పరం దాడులు చేసుకోకుండా సంయమనం పాటించాలని చైనా అంతకుముందు కోరింది.