ఇండియాతో ఫారెన్ పాలసీని కఠినం చేయనున్న చైనా?

ఇండియాతో ఫారెన్ పాలసీని కఠినం చేయనున్న చైనా?

వాషింగ్టన్: తూర్పు లడాఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో చైనా కూడా ఇండియాతో ఫారెన్ పాలసీపై కఠినంగా వ్యవహరించనుందని సమాచారం. ఈ మేరకు ఇండియాతో ఫారెన్ పాలసీ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని చైనా అధినేత జిన్‌పింగ్ నిర్ణయించినట్లు యూఎస్ కాంగ్రెస్ అపాయింటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం తెలిసింది.

‘చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ జిన్‌పింగ్ నాయకత్వంలో న్యూఢిల్లీతో విదేశాంగ విధానాం విషయంలో బీజింగ్ దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. 2013 నుంచి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోట్ (ఎల్‌ఏసీ) వెంబడి ఇండియాతో ఐదు ప్రధాన వాగ్వాదాలకు చైనా పాల్పడింది. తమ బార్డర్స్‌లో పరిస్థితులను స్థిరీకరించడానికి బీజింగ్, న్యూఢిల్లీలు కలసి వరుస ఒప్పందాలపై సంతకం చేశాయి. అలాగే ఆ ఒప్పందాలను పెంపొందించే చర్యలకు కట్టుబడ్డాయి. కానీ ఎల్‌ఏసీని  సుస్పష్టం చేసే యత్నాలను చైనా ప్రతిఘటించింది. ఆ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి నెలకొని ఉండాలనే విషయాన్ని గ్రహించలేదు’ అని యూఎస్–చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ నివేదికలో పేర్కొంది.