చైనా ఐజిన్ కౌంటీలో పూర్తి లాక్ డౌన్

V6 Velugu Posted on Oct 25, 2021

కరోనా వ్యాప్తికి కారణమైన  చైనాను మహమ్మారి మరోసారి వణికిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండడం చైనా వాసులను ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని అనేక ప్రాంతాల్లో, డెల్టా వేరియంట్‌కు చెందిన కరోనా వైరస్‌ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది. చైనా వాయువ్య ప్రాంతంలోని ఇన్నర్ మంగోలియాలోని ఐజిన్ కౌంటీలో పూర్తి లాక్ డౌన్ విధించారు. సోమవారం నుండి ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. ఐజిన్ జనాభా 35,700 మంది ఉండగా.. కరోనా  ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఏజిన్ కరోనా హాట్‌ స్పాట్‌గా ఉంది. గత వారం ఇక్కడ 150 మందికి పైగా వైరస్ సోకింది.  

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు వారంలో  కరోనా  వ్యాప్తి 11 రాష్ట్రాల్లో తీవ్రతరం అవుతుందని హెచ్చరించింది. సోమవారం ఇన్నర్ మంగోలియాలో 38 కోవిడ్ కేసులను కనుగొన్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో  చైనా రాజధాని బీజింగ్ లోను ఆంక్షలు తీవ్రతరం చేశారు. బీజింగ్ సహా ఇన్నర్ మంగోలియా, గాన్సు, నింగ్జియా, గుయిజౌలలో కరోనా  వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tagged China, New Covid Outbreak, Driven By Delta, May Worsen

Latest Videos

Subscribe Now

More News