ఊసరవెల్లిలా మారుతున్న కరోనా: తలలు పట్టుకుంటున్న చైనా

ఊసరవెల్లిలా మారుతున్న కరోనా: తలలు పట్టుకుంటున్న చైనా

కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న చైనాకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. వైరస్ పుట్టుక ప్రారంభమైన వుహాన్  కంటే తాజాగా ఈశాన్య ప్రాంతంలో నమోదైన కేసులు భిన్నంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉత్తర ప్రావిన్స్ ప్రాంతాలైన జిలిన్ మరియు హీలాంగ్జియాంగ్ ప్రజలకు సోకిన వైరస్ ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతుందని, వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి విజయవంతం అవ్వడం లేదని  చైనా  టాప్ క్రిటికల్ కేర్ డాక్టర్లలో   ఒకరైన క్యూ హైబో మీడియాకు వెల్లడించారు.

వుహాన్ లో సోకిన వైరస్ కంటే ఈశాన్యం ప్రాంతంలో సోకిన వైరస్ రెండు వారాలు కంటే ఎక్కువగా ఉందని, వ్యాప్తి చెందకుండా రక్షణ చర్యలు తీసుకోవడం కష్టం గా ఉందని క్యూ హైబో అన్నారు.

షులాన్, జిలిన్ నగరం మరియు షెంగ్యాంగ్ లో చైనా ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసింది. ఈ మూడు ప్రాంతాల్లో సుమారు 100మిలియన్ల జనాభా ఉన్నారు. లాక్ డౌన్ అనంతరం  గత రెండు మూడు వారాల్లో 46 కేసులు నమోదయ్యాయి.

హుబే ప్రావిన్సుకంటే ఈశాన్య ప్రాంతాల్లో నమోదైన కరోనా 68,000పైగా సోకడంతో డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. హుబే ప్రావిన్స్ కి, ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలకు సోకిన వైరస్ కు ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకునే  ప్రయత్నం చేశామని  డాక్టర్ క్యూహైబో సూచించారు.  వైరస్ సోకి బాధితుల సంఖ్య పెరుగుతోందని.. అరికట్టే మార్గల్ని అన్వేషిస్తున్నామన్నారు.