మార్స్​పై నీటి జాడలు

మార్స్​పై నీటి జాడలు
  • స్పేస్​ స్టేషన్​కు పంపిన టియాన్వెన్​-1 ఆర్బిటర్​​
  • ఏడాదిన్నరలో 1,344 చక్కర్లు
  • ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్న లోయలు, నీటి జాడలు

బీజింగ్​: చైనాకు చెందిన టియాన్వెన్–1 ఆర్బిటర్​  మార్స్​ పూర్తి చిత్రాన్ని విజయవంతంగా తీసి స్పేస్​ ఏజెన్సీకి పంపించింది. ఈ ఫొటోలో దక్షిణ ధ్రువం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటో తీసేందుకు టియాన్వెన్-1 ఆర్బిటర్, మార్స్​ చుట్టూ ఏడాదిన్నర కాలంలో 1,344 సార్లు చక్కర్లు కొట్టిందని చైనా స్పేస్​ ఏజెన్సీ ప్రకటించింది. తాజాగా టియాన్వెన్–1 పంపిన చిత్రాల్లో లోయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించింది. మార్స్​పై నీటి జాడలు ఉన్న ప్రాంతాన్ని కూడా ఆర్బిటర్​ గుర్తించిందని, నీళ్లు మొత్తం ద్రవ రూపంలోనే ఉన్నట్టు చెప్పింది. అదేవిధంగా 4,000 కిలో మీటర్ల పొడవైన కాన్యన్​ వల్లేస్​ మారినెరిస్​ ఫొటోలను కూడా ఆర్బిటర్​పంపిందని తెలిపింది. 

మార్స్​ ఉత్తరాన ఉన్న అరేబియా టెర్రా అని పిలువబడే ఎత్తయిన ప్రాంతాల కారణంగా క్రేటర్స్​ ఏర్పడ్డాయని వివరించింది. 18వేల మీటర్ల అస్ర్కేయస్​ మోన్స్​ టాప్​, డౌన్​ వీవ్​తో పాటు ఓ అగ్ని పర్వత చిత్రాన్ని కూడా ఆర్బిటర్​ పంపినట్టు చైనీస్​ స్పేస్​ ఏజెన్సీ ప్రకటించింది. ఆర్బిటర్​ ప్రతీ మార్టిన్​ రోజూ మూడు సార్లు మార్స్​ చుట్టూ తిరుగుతోందని, వేగాన్ని కూడా సెకన్​కు 78 మీటర్లకు పెంచినట్టు ఇంజనీర్లు తెలిపారు. 

2021 ఫిబ్రవరిలోనే కక్ష్యలోకి ఆర్బిట్​చైనా తొలి ప్రయత్నంలోనే 2021, ఫిబ్రవరిలో మార్స్​ కక్ష్యలోకి ఆర్బిట్​ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. రోవర్​ను కూడా సేఫ్​ ల్యాండ్​చేయడంలో చైనీస్ సైంటిస్టులు సక్సెస్​ అయ్యారు. మార్టిన్​ ఆర్బిట్ కక్ష్యలోకి చేరుకున్న తరువాత.. తొలిసారి టియాన్వెన్–1 ఆర్బిటర్​ కీలక మైలురాయిని చేరుకుంది. 2018లో ఓ యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ కూడా దక్షిణ ధ్రువంలోనే నీటి జాడలను గుర్తించింది. ఐస్​ రూపంలో నీళ్లు నిల్వ ఉన్నట్టు ప్రకటించింది.