
స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ షావోమి చైనాలో తమ మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. షావోమి ఎస్‌యూ7 సెడాన్‌ను అమ్మడానికి సేల్స్ లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకుంది. బీజింగ్ ఆటోమొటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్‌తో కలిసి ఈ కారును తయారు చేస్తోంది. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి డెలివరీలు మొదలవుతాయి.