అమెరికాలో చైనా శాస్త్రవేత హత్య

అమెరికాలో చైనా శాస్త్రవేత హత్య

కరోనా వైరస్‌పై పరిశోధనలు చేస్తున్న చైనా రీసెర్చర్ 37 ఏళ్ల బింగ్ లియు శనివారం తన ఇంట్లో శవమై కనిపించారు. బింగ్‌ లియు పిట్స్ బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. అయితే హోగు అనే 46 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆయనను కాల్చి చంపి, ఆపై తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హోగు, బింగ్ లియు ఇద్దరికీ అంతకు ముందే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. లియు పరిశోధనలకు.. ఈ హత్యకు సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.